ప్రముఖ పత్రిక 'బిజినెస్ స్టాండర్డ్'లో గబ్బర్ సింగ్ సినిమా కలెక్షన్స్
గురించి రాసుకొచ్చారు. వారు ప్రచురించిన లెక్కలు ప్రకారం ఈ మూడు వారాల్లో
128.75 కోట్లు కలెక్టు చేసింది. జూన్ 1 నాటికి ఈ లెక్కలు అని వారు
తేల్చారు. గ్లోబెల్ మార్కెట్ లో ఈ చిత్రంకి వచ్చిన రెస్పాన్స్ ,కలెక్షన్స్
తో ఈ లెక్కలు ప్రచురించారు. దబాంగ్ చిత్రం 173 కోట్లు కలెక్టు చేసి టాప్ 5
బాలీవుడ్ చిత్రాలులో ఒకటిగా నిలిచిందని దాన్ని ఈ చిత్రం బీట్ అవుట్
చేసినట్లే అన్నారు.గబ్బర్ సింగ్ చిత్రం ముప్పై కోట్లుతో నిర్మించి 2,857 స్క్రీన్స్ తో ప్రపంచ
వ్యాప్తంగా విడుదల చేసారని,ఎక్కువ సెంటర్లు విడుదల చేసిన తెలుగు చిత్రాలలో
ఒకటిగా నిలిచిందని రాసారు. ఈ విషయమై బాలీవుడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్
కామెంట్ ని యాడ్ చేసారు. తరుణ్ ఆదర్శ్ మాట్లాడుతూ..హిందీ సినిమాలు
విడుదలయ్యే వన్ ధర్డ్ స్క్రీన్స్ లో ఈ చిత్రం విడుదల అయ్యింది. కానీ
అంతకంటే పెద్దదిగా నిలిచింది. అమెరికాలో 43 స్క్రీన్స్ తో ఈ చిత్రం
విడుదలైంది.