అహ్మదాబాద్: గుల్బర్గ అల్లర్ల కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) క్లీన్ చిట్ ఇచ్చింది. గోద్రా సంఘటన
అనంతరం 2002లో గుల్బర్గ్ సొసైటీలో జరిగిన అల్లర్ల కేసుపై సిట్ మంగళవారం
అహ్మదాబాద్ కోర్టుకు నివేదికను సమర్పించింది. నరేంద్ర మోడికి వ్యతిరేకంగా
ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని సిట్ కోర్టుకు ఇచ్చిన నివేదికలో
పేర్కొంది. ఎలాంటి సాక్ష్యాలు లభించనందున కేసును మూసివేస్తున్నట్లు
కోర్టుకు తెలిపింది.
బాధితురాలు జకియా జాఫ్రీ ఫిర్యాదు మేరకు ఆమె పేర్కొన్న నిందితులపై ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని, వారు నేరం చేసినట్టు ఎక్కడా నిరూపితం కాలేదని సిట్ నివేదిక తెలుపుతుందని మెట్రోపాలిటన్ మెజిస్ట్రీట్ ఎంఎస్ భట్ మంగళవారం చెప్పారు.
గోద్రా సంఘటన అనంతరం గుల్బర్గా అల్లర్లలో మృతి చెందిన కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు ఇషాన్ జాఫ్రీ సతీమణి జక్రియా జాఫ్రీ నరేంద్ర మోడితో సహా యాభై మందిని నిందితులుగా పేర్కొంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఫిబ్రవరి 28, 2002లో చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసిన జక్రియా జాఫ్రీకి తుది నివేదిక కాపీని ఇవ్వాలని కోర్టు సిట్‌ను ఆదేశించింది.

0 comments:
Post a Comment