About

కాకినాడ, నెల్లూరు జిల్లాలో పెరిగిన అలల ఉధృతి

Written By sreenu on Wednesday, April 11, 2012 | 4:51 AM

హైదరాబాద్, ఏప్రిల్ 11 : తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో అలల ఉధృతి పెరిగింది. తీర ప్రాంతంలో ఈదురుగాలులు వీచుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని కావలి సముద్ర తీర ప్రాంతంలో 2 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నట్లు సమాచారం. 


దేశానికి పశ్చిమాన ఉన్న అరేబియా సముద్రంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 3.4గా నమోదైంది. ముంబయికి 155 కి. మీ. దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. ముంబయిలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.

0 comments:

Post a Comment