విజయవాడ: నందమూరి - చిరంజీవి అభిమానుల మధ్య ఆదివారం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ
ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలు కాగా మరికొందరిని పోలీసులు అదుపులోకి
తీసుకున్నట్లుగా తెలుస్తోంది. విజయవాడలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము,
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాల విషయంలో
విద్యార్థుల మధ్య ఘర్షణకు దారి తీసినట్లుగా సమాచారం.
విజయవాడలోని గొల్లపూడిలోని ఓ ప్రయివేటు కళాశాల ప్రాంగణంలో ఇది జరిగింది. కటౌట్‌ల విషయమై ఇరువురు అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇది కాస్త గొడవకు దారి తీసింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనలో పది మంది విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇరువురు హీరోల అభిమానులను సముదాయించిన పోలీసులు ఉద్రిక్తతకు కారణమైన ఇరవై మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. కాగా ఎన్టీఆర్ దమ్ము సినిమా ఆడియో ఇటీవలే విడుదలయింది. పవన్ కల్యాణ్ నటించిన గ

0 comments:
Post a Comment