ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘దమ్ము’. త్రిష, కార్తీక
కథానాయికలు. బోయపాటి శ్రీను దర్శకుడు. కె.ఎస్.రామారావు సమర్పణలో
సి.సి.మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె.ఎ.వల్లభ నిర్మించారు. ఈ
నెల 27న రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఎఫ్‌ఎన్‌సిసిలో దర్శకుడు మాట్లాడుతూ
‘‘ఎన్టీఆర్‌ని ఇప్పటివరకూ ఒకవైపే చూశారంతా. ఇక రెండో కోణం చూస్తారు.
తన నడక, నడత ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా ఉంటాయి. రాయల్టీ ఎలా ఉంటుందో చూస్తారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు చేస్తున్నాం. కీరవాణి సంగీతం, రీరికార్డింగ్ హైలైట్’’ అన్నారు. సమర్పకుడు కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్ మాస్ నటన సహా కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలు సినిమాలో పుష్కలంగా ఉంటాయి.
ప్రతి ఒక్కరూ సమాజానికి ఇలాంటి వ్యక్తి అవసరం అనేంత గొప్ప పాత్రలో ఎన్టీఆర్ నటించారు. తల్లిదండ్రులయితే ఇలాంటి కొడుకు కావాలి అని భావిస్తారు. ముఖ్యంగా కుటుంబ సన్నివేశాల్లో ఎన్టీఆర్ నటన కన్నీళ్లు రప్పిస్తుంది. తన నటన అంత అద్భుతం. అలాగే చిత్రీకరణ ఎక్కువగా ఔట్‌డోర్‌లోనే చేశాం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ నెల 27న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. కార్యక్రమంలో చిత్రనిర్మాత (కె.ఎస్.ఆర్ తనయుడు) కె.ఎ.వల్లభ పాల్గొన్నారు.
భానుప్రియ, నాజర్, సుమన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, అలీ, తనికెళ్ల భరణి, రాహుల్‌దేవ్, ఆహుతి ప్రసాద్, వేణుమాధవ్, తదితరులు నటిస్తున్నారు. కెమెరా: అర్థర్ విల్సన్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, రచన: ఎం.రత్నం, పాటలు: చంద్రబోస్, కళ: ఆనంద్ సాయి, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎ.సునీల్ కుమార్.

0 comments:
Post a Comment