శ్రీకాకుళం, : రాష్ట్రంలోని 18 శాసనసభ, ఒక లోక్‌సభ నియోజకవర్గాల
ఉప ఎన్నికల నోటిఫికేషన్ పది రోజుల్లో వెలువడే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన
ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో అన్ని
రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన
మాట్లాడారు. పదిరోజుల్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున
పూర్తి సన్నద్ధంగా ఉండాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
జిల్లాలోని నరసన్నపేట ఓటర్ల జాబితాలకు సంబంధించి పది రోజుల్లో ఇంటింటా బూత్‌లెవల్ అధికారులతో తనిఖీలు నిర్వహించి అవసరమైన చోట్ల మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. ఇప్పటికీ ఓటర్లుగా నమోదు కాని 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా చేర్పించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్‌కు ఒకరు చొప్పున ఏజెంట్లను నియమించి ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు.

0 comments:
Post a Comment