దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన మూడు మున్సిపల్
కార్పొరేషన్‌లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ చతికిల పడింది. ఢిల్లీ
మున్సిపల్ కార్పొరేషన్‌ను (ఎంసిడి) విడగొట్టి ఉత్తర, దక్షిణ, తూర్పు
మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఎన్నికలు
నిర్వహించింది. బిజెపి రెండు కార్పొరేషన్లను గెలుచుకోగా, మూడో దాంట్లో
అతిపెద్ద పార్టీగా నిలిచింది.
దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్లో 104 వార్డులకుగాను బిజెపి ఖాతాలో 44 చేరాయి. కాంగ్రెసు 30 స్థానాల్లో గెలు పొందగా, ఇతరులు 30 స్థానాల్లో గెలిచారు.
ఉత్తర ఢిల్లీ కార్పొరేషన్లో 104 సీట్లకుగాను బిజెపి 59 గెలుచుకోగా, కాంగ్రెసు 29 స్థానాల్లో, ఇతరులు 16 స్థానాలు పొందారు.
తూర్పు ఢిల్లీ కార్పొరేషన్‌లో 64 వార్డు లుండగా, బిజెపి 35 స్థానాల్లో, కాంగ్రెసు 19 స్థానాల్లో గెలుపొందారు. ఐఎన్‌ఎల్డీ ఆరు, ఎస్పీ ఒక స్థానం గెలుచుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జర గనున్న నేపథ్యంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను రెండు పార్టీలూ సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నాయి. 2007లో ఎన్నికల్లో జరిగిన అవిభాజ్య ఎంసిడిలో బిజెపికి 164 మంది కౌన్సిలర్లు ఉండగా, కాంగ్రెసుకు 67 మంది, బిఎస్‌పికి 17 మంది ఉన్నారు.

0 comments:
Post a Comment