About

పశ్చిమ గోదావరిలో చంద్రబాబు ఉపఎన్నికల ప్రచారం

Written By sreenu on Wednesday, April 18, 2012 | 11:51 PM

చంద్రబాబు పశ్చిమ గోదావరి పర్యటన హుషారుగా సాగుతోంది. సర్కారుపై విమర్శలు, ఓటర్లకు వరాల జల్లు కురిపిస్తూ ముందుకు సాగారు. ఈటూర్ పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహాన్ని నింపింది. అర్థరాత్రి దాటినా జనం బాబు ప్రసంగాన్ని వినేందుకు పెద్దసంఖ్యలో రావడంతో పచ్చదండులో కొత్త జోష్‌ నెలకొంది.
ఉపఎన్నికల నేపథ్యంలో పశ్చిమగోదావరిజిల్లా పోలవరం, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు పర్యటించేందుకు వచ్చిన TDP అధ్యక్షుడు చంద్రబాబు తొలిరోజు పోలవరం నియోజకవర్గంలో సాగింది. పోలవరం అసెంబ్లీ సెగ్మెంటులోని కొయ్యలగూడెంలో పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించిన చంద్రబాబు పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించారు. పొగాకు గిట్టుబాటు ధర కల్పించేవరకూ TDP రైతుల తరపున ఉద్యమిస్తుందని హామీ ఇచ్చారు. తర్వాత నియోజకవర్గ తెదేపా నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కలసికట్టుగా పనిచేసి ఎమ్మెల్యేగా మొడియం శ్రీనివాస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, పేద విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇచ్చి, నిరుద్యోగులకు నెలనెలా వెయ్యి రూపాయలులు నిరుద్యోగ భృతి కల్పిస్తామని, రైతులకు 9గంటల పాటు ఉచిత విద్యుత్‌ అందిస్తామని బాబు వరాలజల్లు కురిపించారు. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో బాబు రోడ్ షోకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. బయ్యనగూడెం, సీతంపేట, నరసన్నపాలెం, లక్ష్మీపురం, దర్భగూడెంల మీదుగా రాత్రి పది గంటలకు జీలుగుమిల్లి చేరుకుంది. అక్కడ కాసేపు ప్రసంగించిన చంద్రబాబు పాలచర్ల, మక్కినవారిగూడెంల మీదుగా టి.నర్సాపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు

0 comments:

Post a Comment