న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉప ఎన్నికల
షెడ్యూల్ మంగళవారం మధ్యాహ్నం విడుదల అయింది. ఈ రోజు నుంచే ఎన్నికల నియమావళి
వర్తిస్తుందని కేంద ఎన్నికల కమిషన్ పేర్కొంది. మే 18న నోటిఫికేషన్
వెలువడనుంది. మే 25వరకు నామినేషన్ దాఖలు, మే 26న నామినేషన్ల పరిశీలన
ఉంటుందని ఈసీ పేర్కొంది. మే 28 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. జూన్ 12న
పోలింగ్ జరుగుతుందని, జూన్ 15న ఓట్ల లెక్కింపు ఉంటుందని, ఆదే రోజు ఫలితాలు
వెల్లడికానున్నట్లు ఈసీ తెలిపింది.
ఉప ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడంతో తర్జన భర్జనకు తెరపడింది. రాష్ట్రపతి ఎన్నికలకు ముందే ఉప ఎన్నికలు నిర్వహిస్తామని ఈసి చెప్పగా, ఆగస్టు వరకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాష్ట్ర నేతలకు చూచాయగా చెప్పిందనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా షెడ్యూలు ఈసి విడుదల చేయడంతో చర్చకు తెరపడింది.
రాష్ట్రంలో 18 నియోజవర్గాలు, ఒక పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆయా నియోజక వర్గాలు నర్సన్నపేట, పాయకరావుపేట, రామచంద్రాపురం, పోలవరం, నర్సాపురం, పత్తిపాడు, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, తిరుపతి, అనంతపురం, రాయదుర్గం, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, పరకాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది.
గత ఏడాది డిసెంబరులో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వర్గానికి చందిన పదహారు మంది శాసనసభ్యులపై స్పీకర్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆళ్లగడ్డకు చెందిన శోభా నాగి రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఆమెపై వేటు పడలేదు. ఇక చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో తిరుపతి స్థానం ఖాళీ అయింది.
సిబిఐ ఎఫ్ఐఆర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు ఉన్నదని మేకపాటి రాజమోహన్ రెడ్డి తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్పీకర్ మీరా కుమార్ ఆయన రాజీనామాను ఆమోదించారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు దాదాపు ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకు పోతున్నాయి. కాంగ్రెసు మాత్రం కొన్ని స్థానాలలోనే అభ్యర్థులను ఖరారు చేసుకుంది. అది కూడా బహిరంగంగా ఇప్పటి వరకు ప్రకటించింది లేదు.

0 comments:
Post a Comment