"ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తొలి రోజు మా 'దమ్ము' రూ.12.5-13కోట్ల షేర్‌ను
వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.9 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసింది.
అన్ని వర్గాల వారు ముక్తకంఠంతో సినిమా విజయాన్ని కీర్తిస్తున్నారు.
సకుటుంబంగా చూడదగ్గ సినిమా ఇది'' అని కె.ఎస్.రామారావు అన్నారు. ఎన్టీఆర్
కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో ఆయన సమర్పించిన చిత్రం 'దమ్ము'. ఈ చిత్ర
యూనిట్ శనివారం విలేకరులతో సమావేశమైంది. కె.ఎస్.రామారావు మాట్లాడుతూ
"హృదయాల్ని కదిలించే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి.
బోయపాటి శీను, తారక్ కలిసి అద్భుత ప్రదర్శనగా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో తారక్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశారు. రూలర్ పాట తెలుగులో ఇంతముందు కనీనవిననంత గొప్పగా ఉంది. రికార్డ్ బ్రేక్ కలెక్షన్లు వస్తున్నాయి. మా క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ ఇక మా అబ్బాయి వల్లభ నిర్మాతగా సాగుతుంది. అతని తొలి చిత్రం ఇంత గొప్ప సినిమా కావడం ఆనందంగా ఉంది'' అని అన్నారు. "ఇది నా నాలుగో చిత్రం.
ఇంటిల్లిపాదీ థియేటర్‌కి వెళ్తే అందరికీ కావాల్సిన విషయాలు మా 'దమ్ము'లో ఉన్నాయి. ఎన్టీఆర్ లాంటి బిడ్డ మా ఇంట్లో ఎందుకు లేడు అని చాలా మంది భావిస్తారు. మాస్, ఎమోషనల్, యాక్షన్ చిత్రమిది. నేపథ్య సంగీతం అద్భుతంగా కుదిరింది.
ఫుల్ మీల్‌లా ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ చెప్పే డైలాగులన్నీ కూడా పాత్రకు అనుగుణంగా ఉన్నవే తప్ప వ్యక్తిగతమైనవి కావు'' అని బోయపాటి శీను అన్నారు. "నా తొలి చిత్రం ఇంత గొప్పగా కుదరడానికి సహకరించిన సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. మా హీరోగానీ, దర్శకుడు గానీ మళ్ళీ ఎప్పుడు సిద్ధం అంటే అప్పుడు సినిమా చేయడానికి నేను కూడా సిద్ధంగానే ఉన్నాను'' అని నిర్మాత వల్లభ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు ఆర్థర్ విల్సన్ కూడా పాల్గొన్నారు.

0 comments:
Post a Comment