About

విడుదలకు సిద్దమైన గబ్బర్‌సింగ్

Written By sreenu on Sunday, April 29, 2012 | 9:39 PM

పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'గబ్బర్‌సింగ్'. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. హరీష్ శంకర్ ఎస్. దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ "గబ్బర్‌సింగ్ షూటింగ్ మొత్తం పూర్తయింది. మే మొదటివారంలో సెన్సార్ పూర్తి చేసి, మే రెండో వారంలో చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం. మొదటి నుంచి 'గబ్బర్‌సింగ్'పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. పాటలకు మంచి స్పందన వస్తోంది. ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అయ్యే విధంగా ఎక్స్‌లెంట్‌గా వచ్చింది. కచ్చితంగా పవన్ కెరీర్‌లో పెద్ద హిట్ సినిమాగా నిలుస్తుంది'' అన్నారు. శ్రుతిహాసన్, మలైకా అరోరా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్.

0 comments:

Post a Comment