About

ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు: భన్వర్‌లాల్

Written By sreenu on Thursday, April 12, 2012 | 8:18 PM

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చునని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 15 రోజుల్లోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని ఆయన చెప్పారు. భన్వర్‌లాల్ గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రక్రియను పదిహేను రోజుల్లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.


ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గంలో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందని, ఈ విషయంలో జిల్లాలోని వివిధ రాజకీయపార్టీల నేతలు ఇచ్చిన సలహాలు, సూచనలు ఎంతగానో దోహదపడ్డాయని అన్నారు. ఓటర్ల జాబితా సక్రమంగా ఉంటేనే ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రక్రియలో అధికారులకు సహకరించాలని రాజకీయ నాయకులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

0 comments:

Post a Comment