About

మాచర్ల టిడిపి అభ్యర్థిగా చిరుమామిళ్ల మధుబాబు

Written By sreenu on Thursday, May 3, 2012 | 12:00 AM

మాచర్ల నియోజకవర్గ ఉపఎన్నికల్లో పోటీచేసే తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా చిరుమామిళ్ల మధుబాబు ఎంపికయ్యారు. మధుబాబు పేరును బుధవారం ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. నియోజకవర్గంలోని దుర్గిమండలం ఓబులేసుపల్లె మధుబాబు స్వగ్రామం. బాల్యంనుంచి హైదరాబాద్‌లో నివసించిన మధుబాబు, ఎంఎస్‌ (సాఫ్ట్‌వేర్‌) చదివారు.
అమెరికాలో పదేళ్లు ఉద్యోగంచేశారు. మధుబాబు తండ్రి చిరుమామిళ్ల వెంకట నరసయ్య పోలీస్‌శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. జైళ్లశాఖ ఐజిగా పనిచేసి కొంతకాలం కిందట ఉద్యోగవిరమణ చేశారు. మధుబాబు అమెరికాలో ఉద్యోగంచేసే సమయంలో ఎన్నారైల అసోసియేషన్‌ నుంచి టిడిపికి సహకారం అందించారని,  అమెరికాలో ఉద్యోగాన్ని వదలి వచ్చిన మధుబాబు, అప్పటి నుంచి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్నారు.హైదరాబాద్‌, బెంగుళూరులో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంతోపాటు పల్నాడులో బాయిల్డ్‌ రైసుమిల్లులు, కోల్డ్‌స్టోరేజీలు నిర్వహిస్తున్నారు.  మధుబాబుకు టికెట్‌ రావడంపై ఆ వర్గం నేతలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

0 comments:

Post a Comment