About

ఈరోజుల్లో మారుతి నెస్ట్ సినిమా ‘బస్ స్టాప్’

Written By sreenu on Thursday, May 10, 2012 | 2:45 AM

అతి తక్కువ బడ్జెట్‌లో, పూర్తిగా కొత్త నటీనటులతో ‘ఈ రోజుల్లో’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన దర్శకుడు మారుతి మరో సినిమాకు సిద్దం అయ్యారు. ఈ చిత్రానికి‘బస్ స్టాప్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రం కూడా పూర్తిగా కొత్త వారితో రూపొందించాలనే ఆలోచనలో ఉన్నాడు.

‘బస్ స్టాప్’ చిత్రం ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్... సాయి గణేష్ ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ...స్టార్‌లను నమ్ముకుని తాను సినిమాలు తీయనని, కథను, స్కిప్టును మాత్రమే నమ్ముతానని అన్నారు. ప్రేక్షకులకు అభిరుచికి తగిన విధంగా ‘బస్ స్టాప్’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.

మారుతి ఇది వరకు దర్శకత్వం వహించిన ‘ఈ రోజుల్లో’ చిత్రం విజయవంతంగా ఈ రోజుతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ రోజుల్లో చిత్రం ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించి తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

0 comments:

Post a Comment