About

మోహన్‌బాబు చిత్రంలో మండోదరిగా శ్రీదేవి

Written By sreenu on Friday, May 11, 2012 | 11:14 PM

సుదీర్ఘ కాలం తర్వాత టాలీవుడ్ ఎవర్‌గ్రీన్ శ్రీదేవి తెలుగు వెండితెరపై రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది. విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్, నటవాచస్పతి మోహన్‌బాబుతో కలిసి జతకట్టనుంది.


మోహన్‌బాబు హీరోగా దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో "రావణబ్రహ్మ" పేరుతో కొత్త చిత్రం నిర్మితం కానుంది. ఈ చిత్రంలో మోహన్‌బాబు సరసన నటించేందుకు శ్రీదేవిని సంప్రదించినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి ఆమె సమ్మతిస్తూనే కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసినట్టు సమాచారం.

ఈ చిత్రంలో మోహన్ బాబు రావణబ్రహ్మగా కనిపించనున్నారు. ఆయన భార్య మండోదరిగా నటించేందుకు శ్రీదేవిని దర్శకుడు ప్రతిపాదించినట్టు సమాచారం. గతంలో శ్రీదేవి నటించిన చిత్రాల్లో విలన్‌గా మోహన్ బాబు నటించాడు. కాగా, ఈ చిత్రాన్ని మోహన్ బాబు తనయుడు మంచి విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

0 comments:

Post a Comment